Header Banner

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

  Mon Feb 03, 2025 13:25        Politics

కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు‌చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు వికసిత భారత్ ఫలాలు అందేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో ‌కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లల్లో అద్భుతమైన పాలన అన్న వారు.. ఇప్పుడు తప్పు పడుతున్నారని తెలిపారు. మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల‌ కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయించారని.. ఏపీకి సంబంధించి పోలవరం, రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం మొదటి దశ పనులకు దాదాపు 35 వేల‌ కోట్లు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు‌ చేసేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు బడ్జెట్ గురించి నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

గత ఐదేళ్లల్లో వైసీపీ‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చో పెట్టారని విమర్శలు గుప్పించారు. అమరావతి భ్రమరావతి అని కుట్రలు చేసి రాజధానిని నాశనం చేశారన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారన్నారు. అర్ధరాత్రి తలుపులు మూసి విభజన చేసిన కాంగ్రెస్‌కు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. పిల్ల కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తోందని వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆధ్వర్యంలో అనేక రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం ఏపీలో జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావాలంటే భయపడ్డారని.. ఉన్న పరిశ్రమలు కూడా మూయించి పంపించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఏపీ‌ వైపు చూస్తున్నారన్నారు. కేంద్రం కూడా వారికి అనేక రూపాలలో సాయం అందిస్తోందని తెలిపారు. ప్రధాన ఎయిర్ పోర్ట్‌లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అనేక కేంద్ర ప్రాజెక్టులకు స్థలాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చిన నిధులు కూడా ఇతర అవసరాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాయన్నారు. ‘‘మేము ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని చేస్తుంటే... తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు మా పై బురద జల్లుతున్నాయి. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే...‌ వైసీపీకి ఈసారి ‌ఆ 11 సీట్లు కూడా రావు. ఆత్మ, పరమాత్మ అనుకున్న వాళ్లు కూడా వైసీపీని‌ వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లారు..‌ ఇంకా అనేక మంది కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీ పూర్తిగా కనుమరుగవడం ఖాయం’’ అని సాధినేని యామిని వ్యాఖ్యలు చేశారు.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #SadineniYamini #BJP #YSRCP #Budget 2025